![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-8 క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇక హౌస్ లో కంటెస్టెంట్స్ ఉండేది మరో నెల మాత్రమే. అయితే ఇప్పటివరకు హౌస్ లో ఎవరు మీ ఫెవరేట్..అసలెందుకు అనేది చెప్పేకంటే ముందు అసలు విష్ణుప్రియ ఎలా హౌస్ లో ఉండగలుగుతుంది. (Vishnupriya)
పదకొండు వారాల్లో ఒక్కటంటే ఒక్క టాస్క్ కూడా గెలవకుండా, ఒక్క ఫన్ ఎంటర్‌టైన్మెంట్ చేయకుండా, ఒక్కసారి కూడా హౌస్ లో ఉన్న అందరితో మాట్లాడకుండా ఇంకా గెలుస్తుందంటే దానికి కారణం తను జెన్యున్ అని నమ్మే ఆడియన్స్. హౌస్ లోకి వచ్చిన ప్రతీ ఒక్కరు చెప్పింది రెండే రెండు విషయాలు.. ఒకటి పృథ్వీ ఒక్కడితోనే ఉండకు.. రెండు గేమ్స్ ఆడు.. కానీ తను ఎవరేం చెప్పిన వినట్లేదు. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో విష్ణుప్రియ తరుపున తన చెల్లి, యాంకర్ రవి వచ్చారు. ఇక యాంకర్ రవి తమదైన స్టైల్ లో టిప్స్ ఇచ్చాడు కానీ విష్ణుప్రియ తను మాత్రం పృథ్వీ కోసమే ఆడతానని తెగేసి చెప్పింది.
నిన్ను బయట చూసే ప్రతి అమ్మాయి.. తను ఒకబ్బాయిని నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నీలో చూసుకుంటున్నారు.. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా లవ్ చేయడం అని రవి అన్నాడు. విష్ణు.. ఎక్కడో జారుతున్నదిరో ఎక్కడో జారుతున్నదిరో అని ఇంకా కిందకి పోతున్నావ్ చూసుకోమంటూ హింట్ ఇచ్చాడు. ఇంకా నాలుగు వారాలే ఉంది ఇప్పుడైనా నీ మీద కాన్సట్రేషన్ చేస్తావా.. లేదా నీకు నువ్వే ప్రయారిటీ కాదంటూ తిరుగుతావా అని రవి డైరెక్ట్‌గా అడుగగా.. నాకు అందరు ఇంపార్టెంటెంటే.. నా గురించే ఆలోచిస్తే అది స్వార్థం అవుతుందని విష్ణు వాదిస్తూనే ఉంది.. దీంతో నీకే నువ్వు ప్రయారిటీ కాదంటే నీకెందుకు వేస్తారమ్మా ఓటు అంటూ పరువు తీశాడు రవి. ఇక విష్ణు చెల్లెలు కూడా మాట్లాడుతు.. ముందు నీ గేమ్ పై కాన్సట్రేషన్ పెట్టు.. సో కాల్డ్ 'పీ' (పృథ్వీ)పై కాదంటూ గట్టిగానే చెప్పేసింది. కానీ విష్ణుప్రియ మాత్రం ఏదైన పృథ్వీ కోసమే అన్నట్టుగా ఉంది. కానీ పాపం జనాలేమో తనేమో జెన్యున్ అనుకుంటు ఓట్లు వేస్తున్నారు.
![]() |
![]() |